ఈడీ విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు !

Telugu Lo Computer
0

ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని, ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో  ఎంఎల్సీ కవిత పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈనెల 24న వాదనలు వింటామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది ఈ పిటిషన్‌లో ఈడీపై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ కుట్రలో భాగంగా ఈడీ వేధిస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన విషయంలో నిబంధనలను అధికారులు తుంగలో తొక్కారని..అధికారి పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటున్నారని పిటిషన్‏లో పేర్కొన్నారు. కేసులో తన పేరు ఎక్కడా లేకపోయినా కావాలని ఇరికిస్తున్నారని వాపోయారు. తనను కేసులోకి లాగడం కోసం కొంతమంది ఈడీ బెదిరిస్తోందని..వారి ద్వారా తన పేరు చెప్పిస్తున్నారని ఆరోపించారు. ఇందు కోసం థర్డ్ డిగ్రీ సైతం ఈడీ ప్రయోగిస్తున్నారని కవిత పిటిషన్ ‎లో వెల్లడించారు. చందన్‌ రెడ్డి అనే సాక్షిని కొట్టారని తెలిపారు. అరుణ్‌ రామచంద్ర పిళ్లైను బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారన్నారు. ఎటువంటి సమాచారం లేకుండానే మొబైల్‌ ఫోన్లు సీజ్‌చేశారని కోర్టు దృష్టికి కవిత తీసుకెళ్లారు. సీఆర్పీసీ సెక్షన్‌ 160 ప్రకారం ఓ మహిళను ఆమె ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉన్నా, అలా జరగడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు తీసుకుంటున్నట్లు సీజేఐ ధర్మాసనం తెలిపింది.


Post a Comment

0Comments

Post a Comment (0)