మైనర్ బాలికపై యువకుడి అకృత్యం !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని గ్వాల్టోలి ప్రాంతంలో 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ఉంటున్న ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రేమ వలలో పడేశాడు. అంతేకాదు బ్లేడ్ తో  ఛాతిపై తన పేరు రాశాడు. ఇంటి నుంచి డబ్బులు తీసుకురాకపోతే గొంతు కోస్తానని బ్లేడ్‌తో బెదిరించాడు. చిత్రహింసలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించడంతో ఆమె భయపడింది. దీంతో మైనర్ బాలిక అక్క పెళ్లికోసం తండ్రి దాచిన పదిన్నర లక్షల రూపాయలను తీసుకెళ్లి వాడికి ఇచ్చింది. ఈ క్రమంలోనే తన అక్కకు పెళ్లి కుదిరింది. తండ్రి దాచిన డబ్బులతో పెళ్లి గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాడు. పెళ్లి సమయంలో అందరూ హడావుడిలో ఉండగా ఖర్చుల నిమిత్తం అల్మారాలో దాచిన డబ్బులకోసం ఓపెన్ చేశాడు. బీరువాలో డబ్బులు లేకపోవడంతో షాకయ్యాడు. ఇంట్లో అందరిని పిలిచి విచారణ చేపట్టాడు. ఆ తర్వాత తన చిన్న కూతురుని అడగ్గా మొత్తం వ్యవహారం బయటికి వచ్చింది. బాలిక జరిగిన విషయాన్ని చెప్పడంతో తండ్రి వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. అమన్ అనే అబ్బాయి తనను ప్రేమ ఉచ్చులోకి లాగాడని బాలిక పోలీసులకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అనంతరం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లి మంగళసూత్రాన్ని కూడా తెమ్మని బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో చేసేందేం లేక తల్లి మంగళసూత్రాన్ని దొంగిలించి అమన్‌కి ఇచ్చినట్లు తెలిపింది. ఆ తర్వాత ఆమె నుంచి ఇంకా డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వకుంటే వీడియో వైరల్ చేస్తానని బెదిరించాడు. ఈ మొత్తం కేసులో అమన్ స్నేహితులు కూడా ఉన్నారు, వీడియో వైరల్ అవుతుందనే భయంతో ఆమె నిందితుడికి ఇప్పటి వరకు చాలా సొమ్ము అప్పజెప్పినట్లు పేర్కొంది. బాధితురాలి అభ్యర్థన మేరకు పోలీసులు నిందితుడు అమన్‌, అతని స్నేహితులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అమన్ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు బృందాన్ని ఏర్పాటు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)