అతగాడి పంట పండింది !

Telugu Lo Computer
0


ఆస్ట్రేలియా దేశం లోని బెండిగో – బల్లారత్ పట్టణాల మధ్య “గోల్డెన్ ట్రయాంగిల్” అనే ప్రాంతం. ఆ ప్రాంతంలో బంగారం నిధులు ఉన్నాయి. బాగా లక్ ఉన్నవాళ్లకి అక్కడ గోల్డ్ దొరికిన దాఖలాలు ఉన్నాయి. ఏళ్లకు ఏళ్లు సెర్చింగ్ కొనసాగించినా కొందరికి మాత్రం నిరాశే ఎదురవుతుంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి, ఓ చౌకైన మెటల్ డిటెక్టర్‌తో ఆ ఏరియాలో గోల్డ్ కోసం అన్వేషణ సాగించాడు. అతడిని చూసి పలువురు నవ్విపోయారు. ఏంటి.. దాంతో బంగారం కనిపెడదామనే, అని ఎగతాళి చేశారు. అయినా అతడు తన ప్రయత్నం ఆపలేదు. అలా వెతుకుతూ ఉండగా  ఓ రోజు ఓ చోట మెటల్ డిటెక్టర్ నుంచి సౌండ్ వచ్చింది. వెంటనే అక్కడ తవ్వగా సుమారు నాలుగున్నర కేజీల ఉన్న ఓ రాయి కనిపించింది. దాని రంగు చూసి  అందులో ఎంతో కొంత బంగారం ఉంటుందని అనుకున్నాడు. ఓ నాలుగైదు లక్షలైనా ముడతాయని ఆశపడ్డాడు. వెంటనే ఆ రాయిని తీసుకుని  ఓ బంగారం వ్యాపారి దగ్గరికి వెళ్లాడు. దాన్ని పరిశీలించిన  వ్యాపారి బంగారం లాంటి మాట చెప్పాడు. ఆ రాయి ప్యూర్ గోల్డ్. 4.6 కేజీల బరువు ఉన్న ఆ రాయిలో సుమారు 2.6 కిలోల బంగారం ఉంది. దాని విలువ లక్షల కాదు, కోట్లు. కోటి 30 లక్షల రూపాయలకు దాన్ని డారెన్ క్యాంప్ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఇలాంటి ఘటనలు చాలా అరుదని ఆ వ్యాపారి తెలిపాడు. ఆ బంగారం దొరికిన వ్యక్తి తన పేరును వెల్లడించానికి ఇష్టపడలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)