రూ. 60 వేలకు చేరువలో తులం బంగారం

Telugu Lo Computer
0


గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తుండగా శుక్రవారం బంగారం ధర ఒకేసారి పెరిగింది. తులంపై ఏకంగా రూ. 550 పెరగడం గమనార్హం. ఏప్రిల్‌లో బంగారం ధరలు భారీగా పెరగనున్నాయన్న వార్తలకు ఇది ఊతమిచ్చినట్లైంది. ఇక దేశ వ్యాప్తంగా శుక్రవారం దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది.  దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 53,700 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,180 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,250 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,180 వద్ద నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.53,550 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.58,420 వద్ద ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.53,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.58,470 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,420 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.58,420 వద్ద కొనసాగుతోంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,420 ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)