భారీ అగ్నిప్రమాదంలో 500 దుకాణాలు దగ్ధం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 31 March 2023

భారీ అగ్నిప్రమాదంలో 500 దుకాణాలు దగ్ధం


ఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్‌, బాస్మండి ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం 500 దుకాణాలు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. హమ్‌రాజ్ మార్కెట్‌లోని ఏఆర్‌ టవర్‌లో మంటలు చెలరేగాయి. గురువారం రాత్రి 3 గంటల సమయంలో ఈ మంటలు ప్రారంభమయ్యాయి. అకస్మాత్తుగా అనేక కాంప్లెక్స్‌లు మంటల్లో చిక్కుకున్నాయి. అగ్నిమాపక యంత్రాలు తీవ్రంగా శ్రమించినా మంటలు అదుపులోకి రాలేదు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా స్పందించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఏఆర్ టవర్‌లోని భవనంలో చిక్కుకున్న వారందరినీ అగ్నిమాపక సిబ్బంది రక్షించగలిగారు. మంటలను ఆర్పడానికి దాదాపు రెండు డజన్ల ఫైర్ టెండర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆపరేషన్ ఆరు గంటలకు పైగా కొనసాగింది. రెండు డజన్లకు పైగా అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈదురు గాలులు వీయడంతో పక్కనే ఉన్న మార్కెట్‌, భవనాలకు మంటలు వ్యాపించాయి. ప్రభావిత ప్రాంతాలలో మసూద్ టవర్ 1, మసూద్ టవర్ 2, హమ్రాజ్ కాంప్లెక్స్ ఉన్నాయి. 'ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. భవనంలో ఎవరూ చిక్కుకోలేదు' అని ఉత్తరప్రదేశ్ ఫైర్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. అగ్నిప్రమాదం కారణంగా దాదాపు 100 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. 

No comments:

Post a Comment