బాన్సువాడకు రూ.50 కోట్లు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 1 March 2023

బాన్సువాడకు రూ.50 కోట్లు !


తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో సిఎం కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడారు. ఒక్క బాన్సువాడ ఏరియాలోనే రైతులు రూ.1500 కోట్ల పంట పండిస్తున్నట్లు స్థానికుల ద్వారా తెలిసిందని సిఎం పేర్కొన్నారు. పోచారం నాయకత్వంలో బాన్సువాడ నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందిందని, బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి కోసం సిఎం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద రూ.50 కోట్లను కేటాయిస్తున్నానని కెసిఆర్ ప్రకటించారు. అంతకుముందు బాన్సువాడకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనస్వాగతం పలకగా, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. పోచారం, సిఎం కెసిఆర్ దంపతులను పట్టువస్త్రాలతో సన్మానించారు. దేవాలయం తరఫున సిఎం కెసిఆర్‌కు జ్ఞాపికను పోచారం అందచేశారు. ఆ తర్వాత సిఎం కెసిఆర్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

No comments:

Post a Comment