భూకంప ధాటికి టర్కీ ఆరు మీటర్లు జరిగింది !

Telugu Lo Computer
0


గత సోమవారం సంభవించిన అత్యంత శక్తిమంతమైన భూకంపం ధాటికి ఆ దేశం ఐదు నుంచి ఆరు మీటర్ల మేర పక్కకు కదిలినట్లు ఇటలీకి చెందిన సీస్మాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ కార్లో డగ్లియాని వెల్లడించారు. టర్కీ ఉన్న టెక్టానిక్‌ ప్లేట్స్‌ (భూమి పైపొరలోని ఫలకాలు) మధ్య రాపిడి కారణంగా ఈ కదలిక జరిగినట్లు తెలిపారు. తమ అంచనా ప్రకారం.. ఈ భూకంప తీవ్రతతో సిరియాతో పోలిస్తే టర్కీ 5-6 మీటర్ల పక్కకు జరిగినట్లు వెల్లడించారు. టర్కీ భూభాగం కింద ఉన్న అనతోలియా, అరేబియా, యూరోషియా, ఆఫ్రికా భూఫలకాలు నిరంతరం ఒకదానితో ఒకటిఢీకొనడంతో 7.8, 7.2 తీవ్రతతో వరుసగా రెండు సార్లు శక్తిమంతమైన భూకంపాలు సంభించినట్లు ఆయన తెలిపారు. తాజాగా సంభవించిన భూకంపం టర్కీ కిందనే ఉన్న తూర్పు అనతోలియన్‌ ఫాల్ట్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. గతంలోనూ ఇదే ఫలకం రాపిడికి గురై ఇక్కడ భూకంపాలు సంభవించాయి. ఇక, తాజా భూకంప కేంద్రం.. నేల నుంచి 18 కి.మీ లోతులోనే ఉంది. అందువల్లే పెను విధ్వంసాన్ని మిగిల్చింది. భూకంప కేంద్రం లోతు ఎంత ఎక్కువగా ఉంటే.. నష్టం అంత తక్కువగా ఉంటుంది. తాజా భూకంపం పెను ప్రాణ నష్టాన్నే మిగిల్చింది. గత మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా ఇంకా వేల మంది శిథిలాల కిందే నలుగుతూ ప్రాణాల కోసం పోరాడుతున్నారు. టర్కీ, సిరియా దేశాల్లో ఇప్పటికే 15వేల మందికి పైగా మృతి చెందారు. మఅతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)