ఆధార్‌లో అడ్రస్ మార్పు ఇక సులువు !

Telugu Lo Computer
0


ఉద్యోగం కోసమో, ఉపాధి కోసమో చాలా మంది తరచూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అవుతుంటారు. అలాంటి వారికి ముందుగా వచ్చేది అడ్రస్ సమస్య. ముఖ్యంగా ఇప్పుడు ఆధార్ అత్యవసరంగా మారింది కాబట్టి ముందుగా ఇందులో చిరునామా మార్పు చేసుకుంటే చాలా ఇబ్బందులు పరిష్కారమవుతాయి. ఇప్పటివరకు ఈ అడ్రస్ మార్పు చేసుకోవాలంటే అంత సులువుగా ఉండేది కాదు కానీ తాజాగా భారత విశిష్ట ప్రాధికార సంస్థ చేసిన ప్రకటనతో ఈ ప్రాసెస్ చాలా సులువుగా మారింది. ఇక నుంచి ఎవరైనా ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలనుకుంటే కేవలం కుటుంబ పెద్ద పేరుతో ఉన్న రేషన్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికెట్, పాస్ పోర్టు వంటివి సరిపోతాయి. వీటితో సులువుగా తల్లిదండ్రులు, భార్యాపిల్లల ఆధార్ లో అడ్రస్ మార్పు చేసుకోవచ్చు. ఒకవేళ కుటుంబ పెద్దకు సరైన పత్రాలు లేకుంటే ఉడాన్ సూచించిన పద్ధతిలో స్వీయ ధృవీకరణ ఇస్తే సరిపోతుంది. దీనికోసం మై ఆధార్ పోర్టల్ కి వెళ్లి కుటుంబ పెద్ద ఆధార్ టైప్ చేయాలి. వెంటనే కుటుంబ పెద్ద ఆధార్‌కి అనుసంధానమైన ఫోన్ నెంబరుకి ఒక సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ జారీ అవుతుంది. దాన్ని కుటుంబ పెద్ద 30 రోజుల్లోపు ధ్రవీకరిస్తే నిర్ణీత వ్యవధిలో ఆధార్ అడ్రస్ అప్‌డేట్ అవుతుంది. ఒకవేళ గడువులోగా అభ్యర్ధనను తిరస్కరించినా, ధ్రువీకరించకున్నా మళ్లీ కొత్తగా ప్రాసెస్ మొదలుపెట్టాలి. దీనికి 18 నిండిన వ్యక్తులెవరైనా అర్హులేనని వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)