స్నేహితులే చంపారు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 23 January 2023

స్నేహితులే చంపారు !


 హైదరాబాద్ లోని జియాగూడ హత్య కేసును పోలీసులు చేధించారు. సాయినాథ్‌ను తన స్నేహితులే చంపినట్లు పోలీసులు గుర్తించారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బాధితుడిని అక్షయ్, టిల్లు, సోను హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను అదుపలోకి తీసుకున్నారు. అంబర్‌పేటకు చెందిన కార్పెంటర్‌ జంగం సాయినాథ్‌ అనే వ్యక్తిని ఆదివారం సాయంత్రం జియాగూడలో దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. సాయినాథ్‌ను ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి వేట కొడవలి, రాడ్డుతో నరికి చంపారు. పక్కా పథకం ప్రకారమే ఈ హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణకు వచ్చారు. హత్యకు కుట్రపన్నిన నిందితులు సాయినాథ్‌ కదలికలను గమనిస్తూ వచ్చారని, అతడిని అనుసరిస్తూ వచ్చిన ముగ్గురు అనువైన ప్రదేశం కోసం వెంబడించారని పోలీసులు తెలిపారు. జియాగూడ మేకల మండీ సమీపంలో జనసంచారం లేకపోవటాన్ని అవకాశంగా చేసుకొని నిమిషాల వ్యవధిలో హతమార్చి పారిపోయారని పోలీసులు పేర్కొన్నారు.

No comments:

Post a Comment