వందే భారత్ రైలు ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

Telugu Lo Computer
0


సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు బయలుదేరే వందే భారత్ రైలు ను ప్రధాన మంత్రి నరేంద్ రమోడీ   ఢిల్లీ నుంచి వర్చువల్‌ గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆగి ఆగి నడిచే రైళ్ల నుంచి వేగంగా పరిగెత్తే రైళ్ళను తీసుకువచ్చామని, వందే భారత్ ఆత్మ నిర్భర్ భారత్‌కు ప్రతీక అని అన్నారు. ఇది భారత్‌లోనే డిజైన్ చేసి, తయారుచేసిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అని, 2023లో ప్రారంభించిన కొత్త రైలు ఇదని అన్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని ప్రధాని మోదీ తెలిపారు. గడిచిన ఎనిమిదేళ్లలో రైల్వే వ్యవస్థను సౌకర్యవంతమైన ప్రయాణంగా మార్చామని, ఇప్పుడు రైళ్లు ఆధునిక భారత్‌కు అద్దం పడుతున్నాయన్నారు. విస్టాడోమ్ రైలు, కిసాన్ రైలు, హెరిటేజ్ రైలు నడుపుతున్నామన్నారు. 24 పట్టణాలలో కొత్తగా మెట్రో రైళ్లను ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణలో గడిచిన ఎనిమిది  నెలల్లో అద్భుతమైన పనులు చేశామన్నారు. గతంలో 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, ఇప్పుడు రూ. 3వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. మెదక్ లాంటి అనేక ప్రాంతాలు రైల్వే వ్యవస్థతో కనెక్ట్ అయ్యాయన్నారు. తెలంగాణలో రైల్వే ట్రాక్ విద్యుద్దీకరణ మూడింతలు పెంచామని, అలాగే ఆంధ్రప్రదేశ్ లో రైల్వే నెట్‌వర్క్‌ను పెంచడానికి కేంద్రం నిరంతరంగా పనిచేస్తోందని, 350 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లను ఏపీలో ఏర్పాటు చేశామన్నారు. ఏటా 220 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ విద్యుద్దీకరణ ఏపీలో చేస్తున్నామని, ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ బిజినెస్ పెంచుతున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)