కోరిన కారు కట్నంగా ఇవ్వలేదని పెళ్లి రద్దు !

Telugu Lo Computer
0


ఉత్తర్‌ప్రదేశ్ ఘాజియాబాద్‌లో సిద్ధార్థ్ విహార్ అనే ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌ కి ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయింది. అయితే తనకు కట్నంగా ఫార్చునర్ కారు ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం వాగన్ఆర్ కారును బుక్ చేశారు. ఈ విషయం తెలిసిన పెళ్లికొడుకు కుటుంబసభ్యులు తమకు ఫార్చునర్ కారే కావాలని పట్టుబట్టారు. కానీ పెళ్లికూతురు కుటుంబం మాత్రం వాగన్ఆర్ మాత్రమే ఇప్పిస్తామని చెప్పింది. దీంతో ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు వధువుకు మేసేజ్‌ ద్వారా వరుడు తెలియజేశాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)