పసికందుని బలి తీసుకున్న పేదరికం !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో పూంచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నయీ బస్తీలోని ఓ ఇంట్లో ఆదివారం రెండు నెలల పాప తప్పిపోయినట్లు 112 (ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్) పోలీసులకు సమాచారం అందిందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ ఎస్ తెలిపారు. ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 28 గంటల తర్వాత, సోమవారం, ఇంటి వెనుక కాలువలో శిశువు మృత దేహాన్ని గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు తల్లితో సహా కుటుంబ సభ్యులను విచారించడం ప్రారంభించారు. ఘటన జరిగినప్పుడు ఇంట్లో తల్లి, పాప ఒంటరిగా ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలోనే ఆదివారం కాసేపు తాను బయటికి వెళ్లానని, ఇంట్లో పాప కనిపించకుండా పోయిందని తల్లి అనుమానంగా చెప్పింది. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు బాలికను పిల్లి ఎత్తుకెళ్లిందంటూ కట్టుకథ అల్లి చెప్పింది. శిశువు ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులకు ఇంటి పక్కన కాలువలోనే పసికందు నిర్జీవంగా దొరికింది. దీంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం చెప్పింది ఆ మహాతల్లి. తమ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, బిడ్డను పోషించలేనని భావించిన ఆమె చిన్నారిని కాలువలో పడేసనంటూ మరోమారు మాట మార్చింది. కానీ పోలీసుల ఎదుట ఆమె కట్టుకథలు చెల్లలేదు. ఎట్టకేలకు సోమవారం మహిళను అరెస్టు చేశారు పోలీసులు. తదుపరి విచారణలో భాగంగా చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని పోలీసులు తెలిపారు. తల్లిని కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)