అసెంబ్లీ సమావేశాలను రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తాం !

Telugu Lo Computer
0


తెలంగాణ గవర్నర్ తీరును నిరసిస్తూ రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ‎ను సర్కార్ ఉప సంహరించుకుంది. అసెంబ్లీ సమావేశాల రాజ్యాంగబద్ధ నిర్వహణకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు.ఈ మేరకు గవర్నర్ ప్రసంగంతోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది దుశ్యంత్ దవే న్యాయ స్థానానికి వెల్లడించారు. దీంతో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతిస్తారని న్యాయవాదులు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ ‎కు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడం లేదంటూ, ఆమె తీరును నిరసిస్తూ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి మూడో తేదీన తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. గతేడాది గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి కూడా అలాగే అదే తరహాలో ప్రవేశపెట్టాలని భావించింది. అయితే కేసీఆర్‌ సర్కార్‌కు గవర్నర్ తమిళిసై ఊహించని షాక్‌ ఇచ్చారు. అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వకుండా నిలిపివేశారు. దీంతో తెలంగాణ సర్కార్ కోర్టును ఆశ్రయించి, మళ్లీ వెనక్కు తగ్గింది.

Post a Comment

0Comments

Post a Comment (0)