ఆర్ఆర్ఆర్" కు మరో అవార్డు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 24 January 2023

ఆర్ఆర్ఆర్" కు మరో అవార్డు !


ఆర్ఆర్ఆర్. చిత్రం తాజాగా మరో అరుదైన అవార్డును తన ఖాతాలో వేసుకుంది. జపాన్ 46 వ అకాడమీ అవార్డ్స్ లో అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో "ఆర్ఆర్ఆర్" అవార్డును సొంతం చేసుకుంది. ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న అవతార్ ద వే ఆఫ్ వాటర్, టాప్ గన్ మావెరిక్ వంటి హాలీవుడ్ చిత్రాలను దాటి, రాజమౌళి దర్శకత్వ వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుతం సృష్టించింది. అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో "ఆర్ఆర్ఆర్" అకాడమీ అవార్డును కైవసం చేసుకుంది. జపాన్ దేశంలో ఈ చిత్రాన్ని నాలుగు లక్షల మందికి పైగా వీక్షించారు. గతేడాది జపాన్ లో విడుదలైన ఈ సినిమా అక్కడ బ్రహ్మాండంగా ప్రదర్శితం అవుతుంది. జపాన్ లో విడుదల అయ్యి మూడు నెలలు గడిచినా ప్రజలు ఇంకా ఈ సినిమాను చూడడానికి థియేటర్లకు పరుగులు పెడుతున్నారు అంటే సినిమాకి ఉన్న క్రేజ్ ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.

No comments:

Post a Comment