దొంగను చావబాదిన స్క్రాప్ డీలర్ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 15 January 2023

దొంగను చావబాదిన స్క్రాప్ డీలర్ !


ఢిల్లీలోని బుద్ధ విహార్ ప్రాంతంలో గురువారం స్థానికులకు ఒక మృతదేహం కనిపించడంతో  పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే  ప్రాంతానికి చేరుకున్నారు. మృతుడిని దీపుగా గుర్తించారు. అతని వెనుక భాగంలో, అలాగే చేతులు, కాళ్లపై గాయాలుండడాన్ని గమనించి, ఇది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు దీపు కుటుంబ సభ్యుల్ని కలిపి ప్రశ్నించారు. అతడు అడిక్ట్ అని, జనవరి 10వ తేదీ రాత్రి 9 గంటలకు తమకు చివరిసారిగా కనిపించాడని వాళ్లు చెప్పారు. చివరగా దీపు తన స్నేహితుడు నవీన్‌ని కలిసినట్టుగా గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అప్పుడు అతడు జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. తామిద్దరం కలిసి జనవరి 10వ తేదీన శ్యామ్ కాలనీలోని స్క్రాప్ డీలర్ సుదీప్ గుప్తా షాప్‌లో దొంగతనం చేయడం కోసం వెళ్లామని పేర్కొన్నాడు. దీపు లోపలికి వెళ్లగా తాను బయటే పహారా కాస్తున్నానన్నాడు. అయితే ఉదయం ఆరు గంటలకు ఒక వర్కర్ బయట నుంచి డోర్ కొట్టగా తానే డోర్ కొట్టానని భావించి, దీపు డోర్ ఓపెన్ చేశాడని నవీన్ తెలిపాడు. డోర్ తీయగానే ఆ వర్కర్ గట్టిగా అరిచాడని, దీంతో షాప్‌లో నిద్రిస్తున్న మరో ముగ్గురు వర్కర్స్ (రాజీవ్, కౌశల్, విష్ణు) నిద్రలేచారని అన్నాడు. అప్పుడు ఆ ముగ్గురు దీపుని పట్టుకొని చితకబాదారు. వాళ్లు ఓనర్‌కి సమాచారం అందించగా అతడు కూడా వచ్చి విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దెబ్బలకు దీపు అక్కడికక్కడే మృతిచెందాడని, దాంతో భయబ్రాంతులకు గురైన వాళ్లు దీపు మృతదేహాన్ని బుద్ధ విహార్‌లో పడేశారని పోలీసులు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.

No comments:

Post a Comment