ఫిలిప్పీన్స్‌లో కిలో ఉల్లి రూ. 890 !

Telugu Lo Computer
0


ఫిలిప్పీన్స్‌లో ఉల్లితోపాటు కొన్ని కూరగాయల ధరలు కూడా చికెన్, బీఫ్‌ల రేట్లను మించిపోతున్నాయి. గత నెల రోజుల్లో అక్కడ కేజీ ఉల్లిపాయల ధర 11 డాలర్లకు పెరిగింది. అయితే అక్కడ చికెన్ మాత్రం రూ.4 డాలర్లకే అభిస్తోంది. ఫిలిప్పీన్స్‌ ప్రజల కనీస రోజువారి వేతనం 9 డాలర్లు. అంటే వారి ఒక రోజు జీతం కంటే కేజీ ఉల్లిపాయల ధరే ఎక్కువగా ఉందన్నమాట. అక్కడ ధరలు విపరీతంగా పెరగడంతో అక్రమంగా నిల్వచేస్తున్న ఉల్లిపాయలను అధికారులు పట్టుకుంటున్నారు. తాజాగా చైనా నుంచి అక్రమంగా తరలిస్తున్న 3,10,000 డాలర్ల విలువైన ఉల్లిపాయలను జనవరి నెల ప్రారంభంలో ఫిలిప్పీన్స్ అధికారులు పట్టుకున్నారు. ఫిలిప్పీన్స్‌లో నెలకొన్ని దుస్థితిని విమర్శిస్తూ ఆ దేశ పౌరులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 'చాక్లెట్స్‌కు గుడ్‌బై.. హలో ఆనియన్స్‌! ఈ రోజు ఎవరికైనా బహుమతి ఇవ్వాలంటే ఉల్లిపాయలనే తీసుకెళ్లొచ్చు'అని ఒకరు, 'సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లి వస్తున్నప్పుడు చాక్లెట్లకు బదులు మేం ఉల్లిపాయలు తీసుకొచ్చాం'అని మరొకరు తమ పోస్టుల్లో రాసుకొచ్చారు. అమెరికాకు వెళ్తూ డబ్బా ఉల్లిపాయల పొడి తీసుకెళ్తున్న ఫోటోను ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లలో ఉల్లితో వండే వంటకాలన్నింటినీ మెనూ లిస్ట్‌ నుంచి తొలగించారు. గత ఏడాది అక్కడ సంభవించిన తుఫానుల వల్ల ఉల్లి ఉత్పత్తి దెబ్బతిందని, అందుకే అక్కడ ఉల్లి ధరలు మండిపోతున్నట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)