మాస్ మ్యారేజ్ స్కీంలో ప్రభుత్వ ఉద్యోగం !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని బన్స్ డిహ్ జిల్లాలో బుధవారం మాస్ మ్యారేజ్ స్కీం కింద 506 మంది హిందూ సాంప్రదాయం ప్రకారం సామూహిక వివాహాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి  హాజరైన రవాణా శాఖ సహాయ మంత్రి దయా శంకర్ సింగ్ నూతన వధూవరులకు బహుమతులిచ్చి, మాస్ మ్యారేజ్ స్కీం కింద కొత్తగా పెళ్లయిన జంటలకు అర్హతను బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ప్రకటించారు. ఈ పథకం కింద పేద యువతీ యువకులకు రాష్ట్ర ప్రభుత్వమే వివాహాలు జరిపిస్తుంది. ముఖ్యమంత్రి యోగీ హయాంలో పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించి డెవలప్ అవ్వాలని మంత్రి ఆకాంక్షించారు. కాగా, తాజా ప్రకటనతో రానున్న కాలంలో ఈ పథకం కింద పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)