పుంగనూరులో ఉద్రిక్తత

Telugu Lo Computer
0


చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్‌ను పరామర్శించడానికి బీసీ సంఘాలు, యాదవ సంఘాలు ఛలో పుంగనూరు కార్యక్రమం తలపెడితే, మరోవైపు గత ఎన్నికల సమయంలో ఓట్లు కోసం ఇచ్చిన టోకన్స్ కు ఇప్పుడైనా డబ్బులు ఇవ్వాలంటూ పుంగనూరులో బోర్డులు, బ్యానర్లు వెలిశాయి. దీంతో ఎప్పుడూ ఎమీ జరుగుతోందనే ఆందోళన స్థానికుల్లో నెలకొంది. దీంతో పుంగనూరులో పోలీసులు భారీగా మోహరించారు. చిత్తూరు జిల్లాలో 30 యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి ర్యాలీలకు, సభలకు అనుమతి లేదంటున్నారు. కాగా, పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ ఇంటిపై ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుంగునూరులో పలు ప్రాంతాల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. ఈ దాడిలో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు చెబుతున్నారు.. దాడిలో రూ.5 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని రామచంద్రయాదవ్‌ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే కాగా మారణాయుధాలతో తనపై హత్యాయత్నం చేశారని పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ ఆదివారం పోలీస్‌ 30యాక్ట్‌ ఉల్లఘించారని ఆయనతో పాటు 69మందిపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)