ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులకు సమన్లు జారీ !

Telugu Lo Computer
0


ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు సహా ఈ కేసులోని మొత్తం ఏడుగురు నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను జనవరి 3కు వాయిదా వేసింది. అయితే లిక్కర్ స్కాంపై సమగ్ర దర్యాప్తు తర్వాత నవంబరు 25న సీబీఐ దాదాపు 10వేల పేజీల ఛార్జిషీట్ ను సమర్పించింది. ఇందులోని ఏడుగురు నిందితుల్లో విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ ఆర్.పిళ్లై, మూత గౌతమ్, సమీర్ మహేంద్రు, కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్ ఉన్నారు. వీరందరూ జనవరి 3న తమ ఎదుటు హాజరుకావాలని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ ఆదేశించింది. సీబీఐ ఛార్జిషీట్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేరు లేదు. అయితే ఆయనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)