కాంగ్రెస్‌, బిజెపి రెండూ ఒకటే

Telugu Lo Computer
0


సిద్ధాంతాలు వేరైనా బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ ఒకటేనని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీపార్టీ నేత అఖిలేష్‌యాదవ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌గాంధీ గత కొన్నిరోజులుగా భారత్‌ జోడో యాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. జోడో యాత్ర షెడ్యూల్‌ ప్రకారం ఢిల్లీ నుంచి యుపిలోకి జనవరి 3న ప్రవేశిస్తుంది. ఈ నేపథ్యంలో జోడోయాత్రకు మీకు ఆహ్వానమందిందా అని అఖిలేష్‌ యాదవ్‌ని విలేకర్లు ప్రశ్నించారు. ఈ సందర్భంగా అఖిలేష్‌ మాట్లాడుతూ.. 'మా పార్టీది భిన్నమైన సిద్ధాంతం. కానీ సిద్ధాంతాలు వేరైనా బిజెపి, కాంగ్రెస్‌లు మాత్రం రెండూ ఒకటే అని ఆయన సమాధానమిచ్చారు. పైగా 'జోడోయాత్రకు నాకెలాంటి ఆహ్వానం అందలేదు. ఒకవేళ మీ ఫోన్‌లో మీకు ఆహ్వానం ఉంటే దయచేసి నాకు పంపించండి' విలేకర్లను ఆయన కోరారు. యుపిలో అఖిలేష్‌ యాదవ్‌కి, బిఎస్‌పి నేత మాయావతికి జోడో యాత్రకు ఆహ్వానం పంపినట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఎస్పీ అధికార ప్రతినిధి ఘనశ్యామ్‌ తివారీ మాట్లాడుతూ.. 'భారత్‌ జోడో యాత్ర ఆలోచనకు తమ పార్టీ మద్దతిస్తోంది. అయితే కాంగ్రెస్‌తో ఎస్పీ పార్టీ పొత్తు పెట్టుకుంటుందనే ఊహాగానాలు మాత్రం వాస్తవం కాదు' అని ఆయన స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)