పాలిస్తున్న మేక పోతులు !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ బుర్హానాలోని ప్రైవేట్ మేకల పెంపకం, శిక్షణ, పరిశోధన కేంద్రం దేశంలో ప్రత్యేకతను చాటుకుంటోంది. నాలుగు భిన్నమైన జాతులకు చెందిన మగ మేకలు ప్రస్తుతం పాలు ఇస్తుండటం ఆసక్తిగా మారింది. తమ దగ్గర పది నుంచి పన్నెండు వరకు జాతుల మేకలు ఉన్నాయని పరిశోధన కేంద్రానికి చెందిన డాక్టర్ తుషార్ అన్నారు. బీటల్, హంసా, హైదరాబాదీ, పతీరా జాతులకు చెందిన మగ మేకలు పాలు ఇస్తున్నాయని చెప్పారు. మేక శరీరంలో హార్మోన్ల మార్పులతోనే పాలు వస్తున్నాయన్నారు. ఆడ మేక, మగ మేకల పాలలో ఎలాంటి తేడాలు లేవన్నారు. వందలో ఒకటి రెండు మగ మేకలు ఇలా పాలిస్తున్నాయని తెలిపారు. పాలిస్తున్న మేకలతో బుర్హానాలోని సర్తాజ్ ఫామ్ ఫేమస్ అవుతోంది. వీటిపై పరిశోధనలు చేసేందుకు కూడా చాలా మంది వస్తున్నారన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)