గౌతమీకే నా జీవితంలో మొదటి ప్రాధాన్యత !

Telugu Lo Computer
0


కమలహాసన్ కు రెండు వివాహాలు కూడా అయ్యాయి. అయితే వాళ్ళిద్దరికీ కూడా విడాకులు ఇచ్చారు. కమలహాసన్ మొదటి భార్య సారిక కు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం హీరోయిన్లుగా రాణిస్తున్నారు. శృతిహాసన్  ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే . అక్షర హాసన్ కూడా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తన అడుగులు వేస్తోంది. అయితే లేటు వయసులో కూడా ప్రముఖ హీరోయిన్ గౌతమి తో కమలహాసన్ సహజీవనం చేశారు. కమలహాసన్ తో గౌతమి చాలా సినిమాలలో నటించిన నేపథ్యం వల్లే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటికే గౌతమి వైవాహిక జీవితంలో విడాకులు అవడంతో కమలహాసన్ తో సహజీవనం చేసింది. చాలా సంవత్సరాల పాటు వీరిద్దరూ కలిసే ఉన్నారు. ఈ విషయంలో కూడా ఎటువంటి దాపరికాలు కూడా లేవు. అటు కమల్ కూతుర్లు, అలాగే గౌతమి కూతురు కూడా వీళ్ళిద్దరి బంధాన్ని సమర్థిస్తున్నారు.  వారికి ఇష్టమైనట్టుగా వారి జీవించడంతో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని వీళ్లంతా స్పష్టం చేయడం గమనార్హం . సారిక కూడా ఇంకొక వ్యక్తితో కలిసి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఎటువంటి నిజం లేదనే చెప్పాలి. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కమలహాసన్ గౌతమి పై తన ప్రేమను చాటుకున్నాడు. ఉత్తమ విలన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు గడ్డపై హల్చల్ చేస్తున్న కమల్.. గౌతమీతో తనకున్న బంధం గురించి ప్రస్తావించాడు. తన జీవితంలో అత్యధికంగా ప్రాముఖ్యత ఇచ్చేది గౌతమీకే అని, తన ప్రతి ఆలోచన ఆమెతోనే షేర్ చేసుకుంటానని కమల్ తెలిపాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)