యూట్యూబ్‌పై రూ.75 లక్షలకు దావా !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌కు చెందిన ఆనంద్ కిషోర్ చౌదరి, ఆ రాష్ట్ర పోలీస్‌లో చేరేందుకు పోటీ పరీక్షకు ప్రిపేర్‌ అయ్యాడు. ప్రిపరేషన్‌ కోసం యూట్యూబ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నాడు. అయితే యూట్యూబ్‌ వీడియోల్లో వచ్చిన లైంగిక యాడ్స్‌ వల్ల తన ఏకగ్రత దెబ్బతిన్నదని, దృష్టి మళ్లిందని అతడు ఆరోపించారు. దీని వల్ల పోలీస్‌ ఉద్యోగ పరీక్షలో విఫలమైనట్లు పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో యూట్యూబ్‌ నుంచి రూ.75 లక్షల పరిహారం ఇప్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాడు. కాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్‌కే కౌల్, ఏఎస్‌ ఓకాలతో కూడిన ధర్మాసనం ఆనంద్‌ కిషోర్‌ పిటిషన్‌ను శుక్రవారం తిరస్కరించింది. తన వాదన వినిపించేందుకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన అతడికి చీవాట్లు పెట్టింది. 'ఇంటర్నెట్‌లో ప్రకటనలు చూసినందున నష్టపరిహారం కావాలా? దాని కారణంగా మీ దృష్టి మళ్లినందుకు పరీక్షలో విజయం సాధించలేకపోయారా?' అని ప్రశ్నించింది. 'అలాంటి ప్రకటనలు నచ్చకపోతే, చూడకండి' అని బెంచ్ పేర్కొంది. మరోవైపు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దాఖలైన అత్యంత దారుణమైన పిటిషన్లలో ఇది ఒకటని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పబ్లిసిటీ కోసం వేసే ఇలాంటి పిటిషన్లు న్యాయవ్యవస్థ సమయాన్ని పూర్తిగా వృథా చేస్తాయని మండిపడింది. అంతేగాక పిటిషనర్‌ ఆనంద్ కిషోర్‌కు తొలుత లక్ష జరిమానా విధించింది. అయితే కోర్టుకు క్షమాపణలు చెప్పిన అతడు తాను నిరుద్యోగినని, జరిమానా విధించవద్దని కోరాడు. స్పందించిన సుప్రీంకోర్టు, లక్షకు బదులు రూ.25,000 జరిమానా చెల్లించాలని అతడ్ని ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)