కోల్‌కతా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతా నగరంలో ఎస్ఎస్‌కేఎం  ప్రభుత్వ ఆసుపత్రి రెండో అంతస్తులో రాజుకున్న మంటలు నిమిషాల వ్యవధిలోనే సీటీ స్కాన్ గది, ఎక్స్ రే రూంలోకి వ్యాపించాయి. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ ఈ అగ్ని ప్రమాదంలో రోగులెవరూ గాయపడలేదు.10 అగ్నిమాపక వాహనాలు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. అగ్నిప్రమాదం జరిగిన ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రులు ఫిర్హాద్ హకీం, అరుప్ బిశ్వాస్, డీసీపీ ఆకాష్ మఘారియాలు సందర్శించారు. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)