టోర్నీ నుంచి ఆస్ట్రేలియా ఔట్ !

Telugu Lo Computer
0


టీ20 ప్రపంచకప్ 2022లో ఇంగ్లండ్ జట్టు సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. గ్రూప్‌1లో న్యూజీలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ఐదేసి మ్యాచ్‌లు ఆడి, మూడు విజయాలు సాధించాయి. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా, ఒక మ్యాచ్‌లో ఓడిపోయాయి. ఇలా మూడు జట్లూ 7 పాయింట్లు చొప్పున సాధించాయి. అయితే, నెట్ రన్‌రేట్ విషయంలో న్యూజీలాండ్ 2.113తో ముందుండగా, ఇంగ్లండ్ 0.473తో రెండో స్థానం సాధించింది. ఆస్ట్రేలియా మైనస్ 0.173తో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో తొలి రెండు స్థానాలు సాధించిన న్యూజీలాండ్, ఇంగ్లండ్ సెమీ ఫైనల్స్ చేరుకున్నాయి. గ్రూప్1లో చివరి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ఓపెనర్ నిసంక 67 పరుగులు, రాజపక్స 22 పరుగులు, మరో ఓపెనర్ కుశాల్ మెండిస్ 18 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వుడ్ 3 వికెట్లు తీశాడు. 142 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. బట్లర్ 28 పరుగులు, హేల్స్ 47 పరుగులు చేశారు. బెన్ స్టోక్స్ 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, తమ జట్టు సెమీ ఫైనల్స్ చేరుకునేందుకు సాయపడ్డాడు. దీంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు 144 పరుగులు చేసింది. సెమీ ఫైనల్స్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఒత్తిడిని అధిగమించి, బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)