మొకామా అసెంబ్లీ స్థానంలో ఆర్జేడీ గెలుపు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 6 November 2022

మొకామా అసెంబ్లీ స్థానంలో ఆర్జేడీ గెలుపు


బీహార్ రాష్ట్రంలోని మొకామా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి నీలం దేవి గెలుపొందారు. సమీప బీజేపీ అభ్యర్ధి సోనమ్ దేవీపై 66 వేల 587 ఓట్ల మెజార్టీతో నీలం విజయం సాధించారు. ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ ఏ మాత్రం గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. నీలం దేవికి 79,744 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవికి 63,003 ఓట్లు వచ్చాయి. నీలం దేవి భర్త పేరు అనంత్ కుమార్ సింగ్. అతడు గతంలో ఇదే స్థానంలో ఎమ్మెల్యేగా ఉండేవాడు. అనంత్ నివాసం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పాట్నా కోర్టు అనంత్ ను దోషిగా నిర్ధారించింది. దీంతో ఈ ఏడాది జూలైలోనే అనంత్ పై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బై పోల్ లో ఆర్జేడీ అభ్యర్థిగా సింగ్ సతీమణి నీలం దేవి బరిలోకి దిగి విజయభేరి మోగించారు. '' నా గెలుపును ముందే ఊహించాను. ఎవరూ పోటీలో నిలువలేరని ముందే చెప్పాను. ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా ఆర్జేడీకి భారీ ఆధిక్యం కట్టబెట్టారు'' అని నీలం దేవి వ్యాఖ్యానించారు.

1 comment:

  1. ఇక్కడ ఒక విడ్డూరం ఉంది మన వ్యవస్థలో. నేరపూరితరాజకీయాల ప్రభావాన్ని చక్కగా తెలియజేసేది ఇది. ఒకరిని నేరస్థుడని చట్టసభనుండి తొలగించితే వారి కుటుంబసభ్యులు ఆస్థానాన్ని పూరించటం దేనికి సంకేతం? ముఖ్యంగా జనం మీద దౌర్జన్యభయం పనిచేయలేదని మనం చచ్చినట్లు నమ్మాలి. ఎందుకంటే మన న్యాయ,చట్టవ్యవస్థలు అటువంటి అవకాశాలను నిస్సంకోచంగా ఇస్తున్నవి కనుక!

    ఈరోజు ఉదయమే‌ చదివాను గాలి జనార్దన రెడ్డి గారు పులి యట! వేటకు బయలుదేరుతున్నారట. ఈపార్టీ ఆపార్టీ వగైరా వివక్షలేవీ ఉండవట తన వేటలో!

    ఓదేవుడా రక్షించు మాదేశాన్ని!

    ReplyDelete