శ్రీవారి ఆస్తులపై టీటీడీ శ్వేతపత్రం విడుదల

Telugu Lo Computer
0


శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం టీటీడీ విడుదల చేసింది. బ్యాంకుల్లో రూ.15,938 కోట్ల డిపాజిట్లు, 10,258.37 కిలోల బంగారం ఉన్నట్లు వెల్లడించినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గత మూడేళ్లలో శ్రీవారి నగదు డిపాజిట్లు భారీగా పెరిగినట్లు వెల్లడించారు. అయితే.. తిరుపతిలో టీటీడీ జారీ చేస్తున్న ఎస్డీ టోకెన్లు భక్తులు పొందితే..కంపార్టుమెంట్లలో భక్తులు వేచి వుండే సమయం లేకుండా సులభతరంగా శ్రీవారిని దర్శించుకోవచ్చని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ డిపాజిట్లపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని భక్తులు నమ్మొద్దన్నారు.  జాతీయ బ్యాంకులలోనే నగదు, బంగారంను టీటీడీ డిపాజిట్ చేస్తుందని, టీటీడీ డిపాజిట్ల చేసిన వివరాలను నేడు శ్రీవారి భక్తులకు తెలియజేశామన్నారు. అప్పన్న హృదయ స్కీంకు లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన భక్తుడికి ఆరు విఐపి బ్రేక్ దర్శనం టిక్కెట్లను జారీ చేస్తామని ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. వికలాంగులు, వయోవృద్ధులు దర్శనానికి వెళ్ళే సమయంలో వారికి సహాయంగా శ్రీవారి సేవకుల ద్వారా సేవలు అందిస్తామని, అక్టోబర్ మాసంలో 22.74 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. హుండీ ద్వారా 122కోట్ల 23లక్షలు ఆదాయం లభించిందని, కోటి 8లక్షల లడ్డులను భక్తులకు విక్రయించామని టీటీడీ అధికారులు తెలిపారు. 60లక్షల 91వేల మంది భక్తులు అన్నదానంలో అన్నప్రసాదాన్ని స్వీకరించారని, 10లక్షల 25వేల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలను సమర్పించినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)