లిక్కర్‌ స్కామ్‌ బీజేపీ అల్లిన కథ

Telugu Lo Computer
0


లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి బీజేపీ ఒక కథను అల్లి, తన ఇంట్లో సోదాలు నిర్వహించిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా  ఆరోపించారు. మనీశ్‌ సిసోడియాను బీజేపీ మోసపూరితంగా ఇరికించిందనడానికి ఇవాళ రౌజ్‌ అవెన్యూ కోర్టులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటే సాక్ష్యమని చెప్పారు. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి ఇవాళ సీబీఐ దాఖలు చేసిన తొలి చార్జిషీట్‌లో కేసులో ఏ1గా ఉన్న మనీశ్‌ సిసోడియా పేరు లేదు. దాంతో సీబీఐ తనకు క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లుగా భావించాలని ఆయన పేర్కొన్నారు. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి లెఫ్టినెంట్‌ గవర్నర్‌, చీఫ్‌ సెక్రెటరీ ద్వారా ఢిల్లీ సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ తప్పుడు రిపోర్టు తయారు చేయించిందని సిసోడియా అరోపించారు. ఇప్పుడు మనీశ్‌ సిసోడియాకు క్లీన్‌ చిట్‌ లభించినందున లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, కేసులో సిసోడియాకు క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదని సీబీఐ పేర్కొన్నది. చార్జిషీట్‌లో పేరు లేనంత మాత్రాన అయనకు క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లు కాదని, ఆయనపై ఇకపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)