గుజరాత్‌ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి

Telugu Lo Computer
0


మోర్బీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ రాజీనామా చేయాలని,అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అన్నారు. బిజెపి ప్రభుత్వ అవినీతికి ఈ ఘటన నిదర్శనమని పునరుద్ఘాటించారు. బ్రిడ్జీ మరమ్మత్తు పనులను క్లాక్‌ తయారీ కంపెనీకి ఎలా అప్పగిస్తారని మండిపడ్డారు. క్లాక్‌ కంపెనీకి బిజెపితో సంబంధాలు ఉన్నాయని తెలుస్తోందని, అందుకే ఎఫ్‌ఐఆర్‌లో కూడా కంపెనీ పేరుగాని, యాజమాన్యం పేరు గాని చేర్చలేదని అన్నారు. కంపెనీ యాజమాన్యం నుండి బిజెపి భారీ మొత్తంలో విరాళాలను తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయని, వాటిపై కూడా విచారణకు ఆదేశించాలని అన్నారు. గుజరాత్‌లోని మోర్బీ నగరంలో మచ్చు నదిపై తీగల వంతెన కూలిన దుర్ఘటనపై దర్యాప్తు జరిపించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రిటైర్డ్‌ జడ్జీ నేతృత్వంలో జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేసి.. దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. దీనిపై నవంబరు 14న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)