బ్రేక్ దర్శన సమయంలో మార్పులు !

Telugu Lo Computer
0


సామాన్య భక్తులకు పెద్ద పీట వేయాలని నిర్ణయించిన తిరుమల తిరుపతి దేవస్థానం  ఇందులో భాగంగా రేపటి నుంచి బ్రేక్ దర్శన సమయంలో మార్పులు చేయాలని నిర్ణయించింది. సాధారణ రోజులలో అయితే శ్రీవారి దర్శనానికి సగటున 70 వేల మంది నుంచి 80 వేల మంది వరకు వస్తుంటే, వారాంతంలో లక్షకు పైమాటే. ఎలాంటి తారతమ్యాలు లేకుండా వెంకన్న స్వామి దర్శనం కోసం అటు వీ.ఐ.పీలు.. వీవీఐపీలు ఇటు సామాన్య భక్తులు తిరుమలకు చేరుకుంటారు. శ్రీవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో వచ్చే వీఐపీల కోసం కొద్దీ సంవత్సరాల క్రితం టీటీడీ ప్రత్యేక బ్రేక్ దర్శనాలను ఏర్పాటు చేసింది. మొదట ప్రతి రోజు ఉదయం, సాయంకాల సమయంలో బ్రేక్ దర్శనాలు ఏర్పాటు చేసి తిరుమలకు వచ్చే వీఐపీలు.. వివిఐపిలను వారు సిపార్సు చేయబడిన వారికి ప్రత్యేక బ్రేక్ దర్శనాలు కేటాయించి వారిని దర్శనానికి అనుమతించే వారు. కాలక్రమేణా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఘనీయంగా పెరడంతో సామాన్య భక్తులకు అధిక సమయం శ్రీవారి దర్శన భాగ్యం కేటాయించాలన్న సంకల్పంతో అప్పటి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో శుక్ర, శని, ఆదివారాల్లో సాయంకాలం బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. దీంతో వారాంతంలో భక్తుల రద్దీ పెరిగిన బ్రేక్ దర్శనాల రద్దుతో రోజులు సగటున 15 వేల మందికి పైగా సామాన్య భక్తులకు అదనంగా దర్శనభాగ్యం కలిగింది. రేపటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనానికి ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్టు టిటిడి ప్రకటించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుండి తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం ఉంది. తద్వారా తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గే అవకాశముంది. మరోవైపు నేటి నుంచి మాధవంలో శ్రీవాణి ట్రస్టు దాతలకు కౌంటర్ ప్రారంభించారు. శ్రీవాణి ట్రస్టు దాతల కోసం తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో బుధవారం ఉదయం 10 గంటలకు టికెట్ కౌంటర్ ప్రారంభించనున్నారు. ఇకపై శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఇక్కడే ఆఫ్ లైన్ టికెట్లు కేటాయిస్తారు. గదులు కూడా ఇక్కడే మంజూరు చేస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)