శ్యామ్‌ శరణ్‌ నేగీ కన్నుమూత

Telugu Lo Computer
0

 


భారత తొలి ఓటరు శ్యామ్‌ శరణ్‌ నేగీ తన 106 ఏట  కన్నుమూశారు. హిమాచల్‌ప్రదేశ్‌కి చెందిన నేగీ గత కొంతకాలంగా అనారోగ్యం బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నేగీ మృతికి కేంద్ర ఎన్నికల సంఘం విచారం వ్యక్తం చేసింది. అలాగే హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ నేగీ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నేగీ అంత్యక్రియల్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తోంది. హిమాచల్‌లోని కిన్నౌర్‌లో 1917 జులై 1న జన్మించారు. ఇతను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు చాలా దశలు 1952 ఫిబ్రవరిలో జరిగాయి. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితుల రీత్యా.. 1951 అక్టోబర్‌ 25న జరిగాయి. ఆ ఎన్నికల్లో ఓటు వేసిన తొలి వ్యక్తి నేగీ కావడం విశేషం. ఇక నవంబర్‌ 12న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నేగీ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)