ప్లాట్ ఫామ్ మీదకు దూసుకొచ్చిన రైలు - ముగ్గురు మృతి - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 20 November 2022

ప్లాట్ ఫామ్ మీదకు దూసుకొచ్చిన రైలు - ముగ్గురు మృతి


సోమవారం ఉదయం ఒడిశాలోని జజ్ పూర్ జిల్లాలోని ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈసీఓఆర్)లోని ఖోర్ధా రోడ్డు రైల్వే డివిజన్ పరిధిలోని భద్రక్-కపిలాస్ రోడ్ రైల్వే సెక్షన్ లోని కొరాయి స్టేషన్ లో ఓ గూడ్స్ రైలు అదుపు తప్పి ప్లాట్ ఫామ్ మీదకు దూసుకొచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బోల్తా పడిన దాదాపు 10 బోగీలు ధ్వంసమయ్యాయి. ఈ శిథిలాల క్రింద పలువురు చిక్కుకుపోయారు. ప్రమాద ఘటన తీవ్రంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ గూడ్స్ రైలు డోంగోపోసి నుండి ఛత్రపూర్ వైపు వెళుతోంది. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు, ఆర్పీఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్‌ లలో జాజ్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్‌సి)లో చేర్పించారు. ఈ ఘటన కారణంగా స్టేషన్‌ భవనం కూడా దెబ్బతిన్నదని ఈసీఆర్‌ తెలిపారు. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయి కలిగింది.

No comments:

Post a Comment