రెండు విడతల్లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు

Telugu Lo Computer
0


గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సీఈసీ రాజీవ్‌ కుమార్‌ వివరాలు వెల్లడించారు. డిసెంబర్‌ 1న, 5న రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 8 న కౌంటింగ్‌ జరిపి ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 182 శాసనసభ స్థానాలున్నాయని, తొలి దశలో 89 స్థానాలకు, రెండో దశలో 93 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ చెప్పారు. నవంబర్‌ 5 న తొలిదశ ఎన్నికలకు నోటిషికేషన్‌, 10న రెండోదశ ఎన్నికలకు నోటిఫికేషన్‌, 14 వరకు తొలిదశ నామినేషన్ల స్వీకరణ. 15న తొలిదశ నామినేషన్ల పరిశీలన, 17 వరకు తొలిదశ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ, 17 వరకు రెండోదశ నామినేషన్ల స్వీకరణ, 18న రెండోదశ నామినేషన్ల పరిశీలన, 21 వరకు రెండోదశ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. డిసెంబర్‌ 10తో ముగియనున్న ఎన్నికల షెడ్యూల్‌. 

Post a Comment

0Comments

Post a Comment (0)