శ్రద్ధ వాకర్ హత్య కేసు సీబీఐకి అప్పగితకు నిరాకరణ

Telugu Lo Computer
0

శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణను ఢిల్లీ పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు  తోసిపుచ్చింది. పిటిషన్‌ను అంగీకరించడానికి ఒక్క కారణం కూడా కనిపించడం లేదని జస్టిస్ సతీష్ చందర్ శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఢిల్లీ పోలీసుల విచారణపై హతురాలి తల్లిదండ్రులకు లేని అభ్యంతరం మీకెందుకని పిటిషనర్‌ను సూటిగా నిలదీసింది. ఇది పబ్లిసిటీ ఇంట్రస్ట్ లిటిగేషన్ కింద కనిపిస్తోందని, కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించలేమని తెలిపింది. ఢిల్లీ పోలీసులు 80 శాతం విచారణ పూర్తి చేశారని, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) సారథ్యంలో 200 మంది పోలీసు అధికారుల బృందం ఈ కేసు విచారణ జరుపుతోందని ధర్మాసనం తెలిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది తమ వాదన వినిపిస్తూ, అడ్మినిస్ట్రేషన్, సిబ్బంది కొరత, సాక్ష్యాలను వెలికి తీసే సాంకేతిక, సైంటిఫిక్ ఎక్విప్‌మెంట్ కొరత కారణంగా ఢిల్లీ పోలీసులు సమర్ధవంతంగా కేసును హ్యాండిల్ చేయలేరని అన్నారు. నిజానికి ఆరు నెలల క్రితమే హత్యా ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఢిల్లీ పోలీసుల విచారణకు సంబంధించిన విషయాలు, సున్నిత సమాచారం మీడియా ద్వారా జనాలకు వెల్లడవుతున్నాయన్నారు. ఘటనా స్థలిని ఇంతవరకూ ఢిల్లీ పోలీసులు సీజ్ చేయలేదని, దీంతో జనం, మీడియా సిబ్బందికి ఆ ప్రదేశం ఇప్పటికీ అందుబాటులో ఉందన్నారు. కేసులో స్వాధీనం చేసుకున్న వస్తువులు, సాక్ష్యాలు, తదితరాలను మెహ్రౌలి పోలీస్ స్టేషన్ ద్వారా ఎప్పుటికప్పుడు లీక్ అవుతున్నందున సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ ఎవిడెన్స్‌కు ఇంతవరకు సరైన సంరక్షణ లేదని, పోలీస్ స్టేషన్‌లో వీటిని వివిధ వర్గాల ప్రజలు, మీడియా సిబ్బంది వీటిని టచ్ చేస్తున్నారని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)