ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, దేశం విడిచి పారిపోతానా?

Telugu Lo Computer
0


అక్రమ మైనింగ్, మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ సీఎం హేమత్ సోరెన్ గురువారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తాను.. దేశం విడిచి పారిపోతానా అని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని కోరింది. ఈడీ విచారణకు వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ''నేను రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను. కానీ, విచారణ జరుగుతున్న తీరు.. నాకు సమన్లు జారీ చేయడం చూస్తే నేను దేశం విడిచిపారిపోతానేమో అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దేశం విడిచి వెళ్లిపోయింది వ్యాపారస్తులే. రాజకీయ నాయకులు కాదు. నన్ను పదవిలోంచి దించేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు లోలోపల కుట్రలు చేసేవాళ్లు. ఇప్పుడు బహిరంగంగానే చేస్తున్నారు'' అని హేమంత్ సోరెన్ వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)