కాశ్మీర్ లో జీ 20 సదస్సు

Telugu Lo Computer
0


జి 20 దేశాల శిఖరాగ్ర సమావేశం వచ్చే ఏడాది జమ్మూ కాశ్మీర్లోని లడక్ ప్రాంతంలో నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇన్నాళ్లు ఉగ్రవాదుల చెరలో బందీ అయిన సుందర కాశ్మీరాన్ని ప్రపంచ అధినేతలకు చూపించేందుకు మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పైగా డ్రాగన్ చేస్తున్న అక్రమాలను ప్రపంచం ముందు ఉంచేందుకు ఆయన కాశ్మీర్లోని లడక్ ప్రాంతాన్ని వేదికగా ఎంపిక చేశారని సమాచారం. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద ఆర్థిక శక్తులు, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతలు కలిగిన జీ 20 కూటమి శిఖరాగ్ర సమావేశానికి జమ్ము కాశ్మీర్ ఆతిథ్యం ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి. భారతదేశంలో తొలిసారిగా 2023లో జి20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సమావేశాలను నిర్వహించేందుకు జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ నుంచి ఇద్దరు నోడల్ అధికారులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దుచేసి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్న మొదటి అతిపెద్ద సదస్సు ఇదే కావడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)