ఓ చిన్న పొరపాటు కొంప ముంచింది !

Telugu Lo Computer
0


ఓ చిన్న పొరపాటు వరల్డ్ జూనియర్ చెస్ చాంపియన్ షిప్‌కు దూరం చేసింది. మొదటి 5 రౌండ్లలో 4 పాయింట్లు గెలుచుకున్న విజయవాడ గ్రాండ్ మాస్టర్ నూతక్కి ప్రియాంక, 6 వ రౌండ్ వచ్చేసరికి పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆరో రౌండ్లో ప్రత్యర్థి బేదుల్లాయేవా (అజర్ బై జాన్‌)పై గెలిచినా కూడా, చివరకు ఓడిన యువతినే విజేతగా అధికారులు ప్రకటించారు. దీనంతటికి కారణం కేవలం ఇయర్‌ బడ్స్‌. గేమ్‌ ముగిసిన తర్వాత చేసిన సాధారణ తనిఖీల్లో ప్రియాంక వేసుకున్న జాకెట్‌లో ఇయర్‌ బడ్స్‌ దొరికాయి. దీంతో నిబంధనల ప్రకారం ఆమెను ఛాంపియన్‌షిప్‌ నుంచి తప్పించారు. మార్నింగ్ వాక్ కు వెళ్లినప్పుడు వేసుకున్న జాకెట్‌లో ఇయర్ బడ్స్ పెట్టి మర్చిపోయానని, అదే జాకెట్‌ను టోర్నీకి కూడా వేసుకెళ్లడంతో ఇదంతా జరిగిందని చెప్పింది ప్రియాంక. '' గేమ్‌కు ముందు, ఆడుతున్నప్పుడు ఇయర్ బడ్స్ ఉన్న విషయమే గుర్తులేదు. ఇయర్‌ బడ్స్‌ లాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను హాల్లోకి అనుమతించరని తెలుసు. ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు. నేను మోసం చేయలేదని ఫిడె పేర్కొనడం కాస్త ఉపశమనాన్నిచ్చింది. ఆ నిర్ణయాన్ని గౌరవిస్తా. ఏదేమైనా ఇలా జరిగి ఉండకూడదు. ఈ సంఘటనతో తీవ్ర నిరాశ చెందా. అందరికీ క్షమాపణలు చెప్తున్నా'' అని ప్రియాంక తెలిపింది. ఫిడే నిబంధనల ప్రకారం టోర్నీ నుంచి ప్రియాంకను బహిష్కరించారు. దీనిపై భారత చెస్‌ సంఘం అధికారులు అప్పీల్‌ చేసినా ఫిడే తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)