ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి !

Telugu Lo Computer
0


బ్యాంకులు, ఆర్థిక సంక్షోభంపై చేసిన పరిశోధనకు గాను  బెన్ ఎస్.బెర్నాన్కే, డగ్లస్ అడ్ల్యూ. డైమండ్, ఫిలిప్ హెచ్.డిబ్‌విగ్‌లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి లభించింది. ఆర్థిక వ్యవస్థలో, మరీ ముఖ్యంగా ఆర్థిక సంక్షోభాల సమయంలో బ్యాంకుల పాత్రపై మన అవగాహనను గణనీయంగా మెరుగుపరిచారని, బ్యాంకులు కుప్పకూలిపోకుండా నివారించడం అవసరమనేది వారి పరిశోధనలో ముఖ్యమైన అంశమని నోబెల్ కమిటీ పేర్కొంది. మనకు బ్యాంకులు ఎందుకున్నాయి ? సంక్షోభ సమయంలో అవి బలహీనంగా మారకుండా ఏం చేయాలి ? బ్యాంకు పతనాల ఆర్థిక సంక్షోభానికి ఎలా కారణం అవుతాయి.. అన్న విషయం ఆధునిక బ్యాంకింగ్ పరిశోధనలో స్పష్టమైందని నోబెల్ కమిటీ  పేర్కొంది. 1980ల మొదట్లో బెన్ బెర్నాన్కే, డగ్లస్ డమైండ్, ఫిలిప్ డిబ్‌విగ్‌లు ఈ పరిశోధనకు పునాదులు వేశారని కమిటీ తెలిపింది. వారి విశ్లేషణలు ఆర్థిక మార్కెట్లను నియంత్రించడంలో, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవడంలో ఆచరణాత్మక ప్రాముఖ్యత కలిగి ఉందని కమిటీ వివరించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)