కాంట్రాక్ట్‌ వర్కర్లు ఏడాది సర్వీసుతోనే గ్రాట్యుటీ !

Telugu Lo Computer
0


నూతన కార్మిక చట్టాలతో ప్రైవేట్‌ రంగంలోని ఉద్యోగులకు జీతం, పిఎఫ్‌కు సహకారం, పనిగంటల్లో మార్పులు వస్తాయని ప్రభుత్వం పేర్కొంటోంది. కొత్త సోషల్‌ సెక్యూరిటీ కోడ్‌, ఇండిస్టియల్‌ రిలేషన్‌ కోడ్‌ ప్రకారం.. కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లింపుల కోసం ఐదేళ్ల సర్వీస్‌ నిబంధనలను సడలించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో ఒక్క ఏడాది సర్వీసు పూర్తయిన ఉద్యోగులు గ్రాట్యుటి పొందవచ్చని తెలిపింది. ఈ ప్రతిపాదనతో ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు, గ్రాట్యుటీ పెరుగుతుందని పేర్కొంది. 29 కేంద్ర కార్మిక చట్టాలను సమీక్షించి, విలీనం చేయడం ద్వారా నాలుగు కొత్త లేబర్‌ కోడ్‌లను రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే ఈ చట్టాలను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర కార్మిక శాఖ ప్రతిపాదిస్తున్న నాలుగు కొత్త లేబర్‌ కోడ్‌ల కారణంగా శాలరీ, పీఎఫ్‌లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా ఉద్యోగి చేతికి వచ్చే జీతం తక్కువ, పీఎఫ్‌ ఎక్కువ కట్‌ అవుతుందని అంటున్నారు. పది మంది కంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్న ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగి ఐదేళ్ల నిరంతర సర్వీస్‌ తర్వాత గ్రాట్యుటీ ప్రయోజనాలను పొందేందుకు అర్హులని పేమెంట్‌ ఆఫ్‌ గ్రాట్యుటీ యాక్ట్‌ 1972 పేర్కొంటోంది. అయితే త్వరలో అమలు చేయనున్న లేబర్‌ కోడ్‌లతో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఏడాది సర్వీసు పూర్తయిన వెంటే గ్రాట్యుటీ ప్రయోజనాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. కానీ కంపెనీ సాధారణ జీతం చెల్లింపులు, గ్రాట్యుటీ నిబంధనలు అలాగే ఉంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)