మహిళల ఆసియా కప్‌లో శ్రీలంకపై భారత్ విజయం

Telugu Lo Computer
0


మహిళల ఆసియా కప్, తొలి మ్యాచ్‌లో భారత్ బోణీ కొట్టింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 41 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి, 150 పరుగులు చేసింది. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.2 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచులో భారత్ బౌలింగ్‌లో అద్భుతంగా రాణించింది. భారత బ్యాటింగ్‌కు సంబంధించి జెమీమా రోడ్రిగ్స్ 76 పరుగులు సాధించి, టాప్ స్కోరర్‌గా నిలిచింది.  151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటింగ్‌లో తడబడింది. లంక బ్యాట్స్‌ఉమెన్ విఫలమయ్యారు. ఆ జట్టులో హాసిని పెరెరా 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆ తర్వాత హర్షిత మాధవి 26 పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచింది. మిగతా ఆటగాళ్లు బ్యాటింగ్‌లో రాణించలేకపోయారు. ఫలితంగా శ్రీలంక 109 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. హేమలత మూడు వికెట్లు, పూజా వస్త్రాకర్ రెండు వికెట్లు తీయగా, దీప్తి శర్మ రెండు వికెట్లు, రాధా యాదవ్ ఒక వికెట్ తీశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)