కష్టసమయాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు ?

Telugu Lo Computer
0



ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా సోమవారం మరో మోటివేషనల్ వీడియోతో ముందుకొచ్చారు. జీవితంలో గందరగోళ పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో వెల్లడించారు. 'ప్రకృతి ఎల్లప్పుడూ మనకు సరికొత్త పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. మీ జీవితంలో ఎదురయ్యే సంక్లిష్ట పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొంటారు..? మీ వృత్తి ఏదైనా కావొచ్చు. కానీ గాలులు (కష్టసమయం) వేగంగా తాకుతున్నప్పుడు ఎగిరేందుకు సిద్ధంగా ఉండండి. కానీ ఆలోచనలు స్థిరంగా ఉండేలా చూసుకోండి. సునిశిత దృష్టితో గమనించండి' అంటూ కెస్ట్రెల్‌ పక్షికి సంబంధించిన వీడియో పంచుకున్నారు. ఆ వీడియోలో గాలులకు పక్షి తన రెక్కల్ని ఆడిస్తూ.. తలను మాత్రం స్థిరంగా ఉంచినట్లు కనిపిస్తోంది. మహీంద్రా ట్వీట్‌పై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇది సంకల్పానికి నిదర్శమని ఒకరు రాసుకొచ్చారు. జీవితంలో ఓ దశలో అందరూ క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటారు. వాటిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలంటూ మరొకరు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)