పరాటాలపై 18 శాతం జీఎస్టీ !

Telugu Lo Computer
0


రెడీ టు ఈట్ పరాటాలపై గుజరాత్ ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయం తీసుకూడా పట్ల  అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  బ్రిటీష్ పాలనలో కూడా ఆహారంపై పన్ను వేయలేదని విమర్శించారు. పరాటాలపై పన్ను విధిస్తూ 'అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్' తీసుకున్న నిర్ణయాన్ని 'గుజరాత్ అప్పిలేట్ అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్' సమర్ధించింది. దీని ప్రకారం.. ఫ్రొజెన్ లేదా రెడీ టు ఈట్/ప్యాకేజ్డ్ పరాటాలపై 18 శాతం జీఎస్టీ విధించబోతున్నారు. నిజానికి ఇంతకుముందు ఇవి చపాతీలు లేదా రోటీల కేటగిరిలో ఉండేవి. వాటిపై 5 శాతం మాత్రమే జీఎస్టీ ఉంది. కానీ, రోటీలు, చపాతీలకు.. పరాటాలకు తేడా ఉందని, వీటిని ప్లెయిన్ చపాతీ లేదా రోటీలుగా పరిగణించలేమని జస్టిస్ వివేక్ రాజన్, జస్టిస్ మిలింద్ తొరవాణే ధర్మాసనం నిర్ణయించింది. దీంతో పరాటాలపై 18 జీఎస్టీ విధించబోతున్నారు. అయితే, చపాతీలు, రోటీలపై మాత్రం 5 శాతం జీఎస్టీనే ఉంటుంది. పరాటాలకు సంబంధించి ఎనిమిది రకాల ఫ్రొజెన్ లేదా రెడీ టు ఈట్ పరాటాలు ఈ కేటగిరిలోకి వస్తాయి. మలబార్ పరాటా, మిక్స్‌డ్ వెజ్ పరాటా, ఆనియన్ పరాటా, మేతి పరాటా, ఆలూ పరాటా, లచ్చా పరాటా, మూలి పరాటా, ప్లెయిన్ పరాటాలపై 18 శాతం జీఎస్టీ ఉంటుంది. అయితే, పరాటాలపై జీఎస్టీ విధిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటీష్ పాలనలో కూడా దేశంలో ఆహార పదార్థాలపై పన్ను విధించలేదన్నారు. ''దేశంలో ద్రవ్యోల్బణానికి అసలైన కారణం కేంద్ర ప్రభుత్వం అధికంగా విధిస్తున్న జీఎస్టీ. ప్రజలపై భారం తగ్గాలంటే జీఎస్టీ తగ్గాలి'' అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)