భార్యను 15 సార్లు కత్తితో పొడిచిన భర్త ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 18 October 2022

భార్యను 15 సార్లు కత్తితో పొడిచిన భర్త !


ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన రమేష్ కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హోస్ కోటేలో నివాసం ఉంటూ ఉద్యోగం చేసేవాడు. ఆ సందర్బంలో అశ్వినీ అనే యువతి రమేష్ కు పరిచయం అయ్యాంది. ప్రేమించుకున్న రమేష్, అశ్వినీ ఏడు  సంవత్సరాల క్రితం  వివాహం చేసుకున్నారు. అశ్వినీ, రమేష్ దంపతుల మద్య తేడాలు రావడంతో రెండు సంవత్సరాల క్రితం ఇద్దరూ విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలతో కలిసి అశ్విని హోస్ కోటే సమీపంలోని సూలిబెలె పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లగుంప ఇండస్ట్రియల్ ఏరియాలో నివాసం ఉంటూ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రమేష్ అతని భార్య అశ్వినీ నివాసం ఉంటున్న ఇంటి దగ్గరకు వెళ్లాడు. పిల్లలను చూడటానికి అశ్వినీ ఇంటికి వెళ్లిన రమేష్ మంచిగా ఉన్నట్లు ఆమెతో నటించాడు. భార్య అశ్వినీతో చక్కగా మాట్లాడి ఆమెతో మంచితనంగా ఉన్ననట్లు నటించిన రమేష్ ఆమెను ఇంటి నుంచి బయటకు పిలుచుకుని వచ్చి ఆమెతో మాట్లాడుతున్న సమయంలోనే జేబులో ఉన్న కూరగాయలు కోసే కత్తితో ఆమెను 15 సార్లకు పైగా ఇష్టం వచ్చినట్లు ఎక్కడంటే అక్కడ పొడిచాడు. దానితో ఆమె కుప్పకూలిపోయింది. అదే కత్తితో రమేష్ కూడా పొడుచుకుని భార్య అశ్వినీ మీద పడిపోయాడు. రెండు నిమిషాలకు అశ్వినీ మీదపడి ఉన్న భర్త రమేష్ ను పక్కకు తోసేసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. తప్పించుకోవడానికి ప్రయత్నించిన అశ్వినీని పట్టుకున్న రమేష్ బండరాయి తీసుకుని ఆమె తల మీద చితకబాదాడు.  భార్య అశ్వినీని రమేష్ కిరాతకంగా పొడుస్తుంటే భర్తను అడ్డుకోకుండా స్థానికులు మొబైల్ లో వీడియోలు తీసి షేర్ చెయ్యడం కలకలం రేపింది. తీవ్రగాయాలైన అశ్వినీ పరిస్థితి విషమంగా ఉందని, ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నదని, రమేష్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని సూలిబెలే పోలీసులు తెలిపారు. మొబైల్ లో వీడియోలు తియ్యకుండా రమేష్ ను అడ్డుకుని అతని చేతిలో కత్తి లాక్కొని ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదని పోలీసులు అంటున్నారు.

No comments:

Post a Comment