ఉచిత రేషన్‌ మరో మూడు నెలలు !

Telugu Lo Computer
0


కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో పేద ప్రజల కోసం రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఉచిత రేషన్‌ పథకం మరికొన్నాళ్లు కొనసాగనుంది. ప్రస్తుత గడువు సెప్టెంబరు 30వ తేదీతో ముగియనుండటంతో మరో మూడు నెలల పాటు ఉచిత రేషన్‌ అందించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. అధిక ద్రవ్యోల్బణం, రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని పొడిగించాలని మోదీ సర్కారు నిర్ణయించింది. దీంతో కేంద్ర ఖజానాపై మరో రూ.44,700 కోట్ల మేర అదనపు భారం పడనుందని కేంద్రం తెలిపింది. డిసెంబరు 31 వరకు ఈ ఉచిత రేషన్‌ను కొనసాగించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)