ఏడుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు త్వరలోనే ఏడుగురు కొత్త న్యాయమూర్తులు రానున్నారు. ఈ మేరకు ఏపీ హైకోర్టుకు నూతన న్యాయమూర్తులను సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. ఏడుగురు న్యాయాధికారులకు జడ్జీలుగా కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన న్యాయమూర్తుల జాబితాలో అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ, బండారు శ్యామ్‌సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహలక్ష్మీనరసింహ, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణ ఉన్నారు. కాగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం లభించగానే ఏగుడురు న్యాయమూర్తులు ఏపీ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో ఏపీ హైకోర్టులో ఫిబ్రవరి నెలలో ఏడుగురు న్యాయమూర్తులను నియమించారు. న్యాయమూర్తులుగా కె. శ్రీనివాసరెడ్డి, జి రామకృష్ణప్రసాద్‌, ఎన్‌ వెంకటేశ్వర్లు, టి రాజశేఖర్‌రావు, ఎస్‌ సుబ్బారెడ్డి, సి. రవి, వి. సుజాతలను గతంలో నియమించారు. జనవరి 29న కొలిజీయం భేటీలో సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ సిఫారసులు చేశారు. అటు సుప్రీంకోర్టుకు త్వరలోనే ప్రధాన న్యాయమూర్తి రానున్నారు. త్వరలోనే ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో జస్టిస్ యూయూ లలిత్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)