ప్లాస్టిక్ నిషేదాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానాలు

Telugu Lo Computer
0


సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు అమ్మేవారికి, వాడేవారికి జరిమానాలు విధించడం మొదలుపెట్టింది ఢిల్లీ గవర్నమెంట్. దేశ రాజధానిలో జులై 1నుంచి నిషేదం అమలవుతుండగా ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ(డీపీసీసీ), అర్బన్ లోకల్ బాడీస్ సంయుక్తంగా సోమవారం ఒక్క రోజులో 119 మందికి జరిమానాలు విధించారు. ఆ ఫైన్ ల మొత్తం రూ.1.23కోట్ల వరకూ ఉందని అధికారులు చెప్తున్నారు. ఫ్యాక్టరీల్లో, మార్కెట్ యూనిట్లలో నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నామని వెల్లడించారు. నిషేదం అమలైన రోజే మొదటి పది రోజుల పాటు హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం.. సోమవారం నుంచి పెనాల్టీలు మొదలుపెట్టింది. మరికొన్ని రోజుల్లో ఇన్‌స్పెక్షన్లు కూడా నిర్వహిస్తామని డీపీసీసీ చెప్పింది. 96 యూనిట్లలో డీపీసీసీ టీమ్స్ ఇన్‌స్పెక్షన్ జరిపాయని వాటిలో 59యూనిట్లకు జరిమానాలు విధించి మూసేశామని చెప్పారు. ఆ జరిమానాల మొత్తం రూ.1.23కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ యూనిట్లకు ఎలక్ట్రిక్ సప్లైని ఆపేయాలని సూచనలు అందాయని టీపీడీడీఎల్ డిస్కం వెల్లడించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)