రెజ్యూమ్ షేర్ చేసిన బిల్ గేట్స్ !

Telugu Lo Computer
0


సుమారు 48 ఏళ్ల క్రితంది. ఆయన కంపెనీ పెట్టకముందు ఉద్యోగం కోసం బిల్ గేట్స్  దరఖాస్తు చేసుకోగా, ఆ సమయంలో తయారు చేసుకున్న రెజ్యూమెను తాజాగా లింక్డ్ ఇన్‌లో షేర్ చేశారు. అందులో ఆయన పేరు విలియం హెచ్ గేట్స్‌గా ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీలో తొలి ఏడాది చదువుతున్నట్టు, ఆపరేటింగ్ స్ట్రక్చర్స్, డేటాబేస్ మేనేజ్‌మెంట్, కంపైలర్ కన్‌స్ట్రక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వంటివి నేర్చుకున్నట్టు అందులో పేర్కొన్నారు. వీటితో పాటు ఫోట్రాన్, కోబోల్, బేసిక్ వంటి వాటిపై అనుభవం ఉందని రాసుకున్నాడు. కాగా, ఈ రెజ్యూమె నెట్టింట్లో వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు.. రెజ్యూమ్ 48 ఏళ్ల కింద తయారు చేసినప్పటికీ ఎంతో ఉత్తమమైనదిగా కనిపిస్తోందని ప్రశంసిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)