బంగ్లాదేశ్ లో ఆసియా కప్‌ ?

Telugu Lo Computer
0


ఆసియా క్రికెట్ కౌన్సిల్ 2022 ఆసియా కప్ ఆగస్టులో నిర్వహించనుంది. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ శ్రీలంక వేదికగా నిర్వహించాలి. అయితే ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న లంక ఆసియా కప్ నిర్వహించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే లంక దేశంలో జరిగే అల్లర్లు  కారణంగా  ఆటగాళ్లు క్రికెట్ ఆడటం సురక్షితం కాదని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆసియా కప్ 2022 శ్రీలంకలో నిర్వహించే అవకాశం లేదు. కాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆసియా కప్ కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ 2022 లో శ్రీలంక, భారతదేశం, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ టీమ్‌లు పాల్గొననున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)