విద్యార్థిని చావబాదిన టీచర్ అరెస్ట్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 7 July 2022

విద్యార్థిని చావబాదిన టీచర్ అరెస్ట్


బీహార్‌లో ఆరేళ్ళ విద్యార్థిని ఓ ట్యూషన్ టీచర్ కర్రతో తీవ్రంగా కొట్టిన దృశ్యాలు ఇటీవల దేశ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ టీచర్‌ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. ఆ టీచర్‌పై దీనిపై కేసు నమోదు చేసిన ధనరువా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ విద్యార్థిని టీచర్ ఎందుకు కొట్టాడన్న విషయాన్ని కూడా మీడియాకు వివరించి చెప్పారు. టీచర్ అమర్ కాంత్ ఓ విద్యార్థినితో మాట్లాడుతుండగా ఆరేళ్ళ బాలుడు చూశాడు. దీంతో తన బండారం బయపడుతుందని ఆగ్రహంతో ఊగిపోయిన అమర్ కాంత్ ఆ ఆరేళ్ళ బాలుడిని మొదట చేతులతో కొట్టాడు. అనంతరం ఓ కర్ర తీసుకుని ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో ఆ బాలుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఒకరు చాటుగా తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment