కేరళ తిరువోనం బంపర్ లాటరీ !

Telugu Lo Computer
0

 


ఓనం  పండుగ సందర్భంగా కేరళ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద లాటరీని అందిస్తోంది. ఈసారి లాటరీ విభాగం హయెస్ట్ బంపర్ ప్రైజ్‌ను అందించేందుకు సిద్ధమైంది. తిరువోణం బంపర్ మొత్తాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాటరీ శాఖకు అనుమతి ఇచ్చింది. ఇందులో ఫస్ట్ ప్రైజ్ విన్నర్‌ రూ.25 కోట్లు ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఇది దేశంలోనే ఒకే టికెట్‌పై అందిస్తున్న అతి పెద్ద గిఫ్ట్ ప్రైజ్. సెకండ్ విన్నర్‌ రూ.5 కోట్లు, తృతీయ బహుమతులు రూ.1 కోటి చొప్పున 10 ఉంటాయి. రాష్ట్ర లాటరీల శాఖ ఓనం బంపర్ లాటరీ 2022కి ఆమోదం తెలిపింది. ఇది మొత్తం రూ.126 కోట్ల ప్రైజ్ మనీ అందజేస్తుంది. ఓనం బంపర్ విభాగం నిర్వహించే అతి పెద్ద లాటరీ - 2019 నుంచి మొదటి బహుమతిగా రూ.12 కోట్లు అందిస్తోంది. ఈ సంవత్సరం టికెట్‌ ధర కూడా రూ.500కి పెరిగింది. గత సంవత్సరం రూ. 300గానే ఉంది. టికెట్‌ల విక్రయాలు జులై 18న ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 18న లక్కీ డ్రా ఉంటుంది. ఫస్ట్ విన్నర్‌కు ఏజెంట్ కమీషన్, ట్యాక్స్ తర్వాత రూ. 15.75 కోట్లు నికర లాభం లభిస్తుంది. ఈ సంవత్సరం గిఫ్ట్ ప్రైజ్ స్ట్రక్చర్ అనేక అంశాలలో మునుపటి ఎడిషన్‌లతో పోలిస్తే మెరుగ్గా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆఫర్ చేసిన మొత్తం ప్రైజ్ మనీ గతేడాది కంటే రూ.72 కోట్లు పెరగనుంది. ఈ సంవత్సరం 10 తృతీయ బహుమతులు ఉంటాయి, 2021లో ఆరు బహుమతులు మాత్రమే ఉన్నాయి. మొదటి బహుమతి గెలుచుకున్న టికెట్‌ను విక్రయించే ఏజెంట్‌కు కమీషన్ రూపంలో రూ.2.50 కోట్లు లభిస్తాయి. మహమ్మారి సమయంలో కఠినమైన సమయాన్ని ఎదుర్కొన్న కేరళ లాటరీల ఏజెంట్లు, అమ్మకందారులకు, దాదాపు రెండు నుంచి మూడు లక్షల మందికి జాక్‌పాట్ ఉపశమనం కలిగిస్తుందని అంటున్నారు. ఈ సంవత్సరం ఏజెంట్లు ఒకే టికెట్‌పై రూ.96 కమీషన్‌గా పొందుతారు. గత ఏడాది రూ.58 అందుకునేవారు. ఈసారి డిపార్ట్‌మెంట్ 90 లక్షల టికెట్‌లను ముద్రించనుంది. గత సంవత్సరం, ముద్రించిన మొత్తంలో 54 లక్షల టికెట్‌లు అమ్ముడయ్యాయి. ఈసారి మొత్తం నాలుగు లక్షల బహుమతులను లాటరీ డిపార్ట్‌మెంట్ అందజేయనుంది. గతేడాదితో పోలిస్తే ప్రైజ్‌ల సంఖ్య రెండు రెట్లు పెరగనుంది. ప్రైజ్ మనీ మొత్తం విలువ రూ.72 కోట్లు పెరగనుంది. కొత్తగా తొమ్మిది మందికి కన్సోలేషన్ ప్రైజ్‌ అందిస్తున్నారు. ఈ విభాగంలో ఒక్కొక్కరికి రూ.5 లక్షలు అందజేస్తారు. ఇది కాకుండా 90 మందికి ఒక్కొక్కరికి రూ.1లక్ష, 72 వేల టిక్కెట్లకు ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున అందజేయనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)